పరిచయం:
బారతదేశం లో అందరికి రామాయణం గురించి తెలుసు. కానీ కొన్నిఅపోహలు ఉండి ఉంటాయి. ఆ అపోహలను తొలగించే చేసిన ఒక చిన్న ప్రయత్నమే ఈ సంపూర్ణ రామాయణం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాలను విని, వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని ఆదరముగా చేసుకొని ఈ సంపూర్ణరామాయణాన్ని ప్రారంబించబోతునాను. నేను ఈ సంపూర్ణ రామాయణాన్ని బాగములుగా విభజించి చెబుతాను.
రామాయణం ను ఆదికావ్యం అని అంటారు. రామాయణాన్ని కి ఆ పేరుని వాల్మీకి మహర్షే పేటరనుకోవాలి. రామాయణం=రామా+ఆయనం రామ అంటె లోకులందరినీ రమింపచేసే నామం ఆయనం అనగా నడక రామున్నియొక్కనడక. రాముల వారి నడవడిక గురించి చెపింది కాబట్టి రామాయణం అయింది.
రామాయణంలో 24 వేల శ్లోకాలు, 6 కాండలు ఉన్నాయి. అవి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్దకాండ.
బాలకాండ:
రాములవారి జననం, బాల్యం, విద్య మరియు విశ్వామిత్రుని మహర్షి ఆజ్ఞ మేరకు తాటకినహతమార్చుట వరకు చేపెదను.
అయోధ్యకాండ:
శివధనస్సు ను విరుచుట, జనకరాజు కుమార్తె సీతాదేవి తో వారి వివాహం, వివాహ అనంతరం అయోధ్యలో నివసించుట వరకు చేపెదను.
అరణ్యకాండ:
తండ్రి ఆజ్ఞ మేర భార్య (సీత), సోదర (లక్షమణ) సమేతముగా అడవికి వెలుట, అడవిలోని వారి జీవనం, సుర్పనక ముక్కు, చెవులు కోయుట, సీత అపహరణ, అడవిలో సీత జడ కోసం వెళుతూ కడంబుడు సప విమోచనం కలిగించుట.
కిష్కిందకాండ:
కడంబుడు సూచించిన వైపుగా వెళ్లి సబరిని కలుసుట, సీతను అపహరించినది రావణాసురుడు అని తెలుసుకోవటం ,హనుమంతుల వారిని కలుసుకొనుట, సుగ్రివుడ్ని కలుసుకొనుట,రాముని సహాయంతో సుగ్రీవుడు, వాలిని హతమార్చుట, సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం వానరాలు నులుదిక్కులకు వెళ్లి సీత జాడ కోసం ప్రయతించుట,సీతమ్మ వారు లంకలో ఉన్రేమో అని తెలుసుకొనుటకు హనుమంతుడను సముద్రం దాటుటకు ప్రేరేపించుట.
సుందరకాండ:
సీతమ్మ వారి జడ కొరకు సముద్రం దాటుటకు సిద్దమగుట, సముద్రుడు హనుమ రాకను తెలుసుకొని ఆతిద్యం ఈవాలను కోవటం, సీతమ్మ జాడ తెలుసుకొని లంక నగరానికి నిప్పు పెట్టి వచుట, సీత దేవి జాడను రాముల వారికి తెలియచేయుట.
యుద్దకాండ:
సీతమ్మ వారి జాడ తెలుకొన రాముడు సేతువు నిర్మించుటకు సిద్దమగుట, సీతువు నిర్మాణం అనంతరం యుద్దానికి సిద్దమగుట,వానర సైన్యంతో లంక లోకి ప్రవేశించుట యుద్ధం ను జయించి సీతమ్మ వారితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చుట.
ఇవి రామాయణం లోని 6 కాండలు. రాముడు రాక్షస సంహారం కోసమే జన్మించ లేదు. రాముడు యుగానికి మూల పురుషుడు అంటారు. రాముడు దేవుడే అయినపటికి తను ఏనాడూ దేవుడిలా జీవించలేదు. ఒక మాములు మనిషిలా జీవించి, ఎలా జీవించాలో చూపించాడు, ఏనాడూ అసత్యం ఆడలేదు, అధర్మాన్ని పతిన్చాలను లేదు. ఎవరితో ఎలా మెలగాలో మనకు తెలియచేసాడు. అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందొ, అంత కాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లితండ్రుల దెగ్గర, సోదరుల దెగ్గర, గురువుల దెగ్గర, భార్య దెగ్గర ఎలా ఉండాలొ, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలొ రాముడిని చూసి నేర్చుకోవాలి.
యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్.
రామ అంటె లోకులందరినీ రమింపచేసే నామం. రావణాసురుడు బ్రహ్మ దేవుడి గురించి తపస్సు చేసి నరవానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరవానరాలని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు, రావణుడే చెప్పాడు, ఇంతమందిని అడిగాను నాకు నరవానరాలు ఒక లెక్క అన్నాడు. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడంటె అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి, ఒక మనిషి తలుచుకుంటె ఏదన్నా సాధించగలడు అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతిఒక్కరు రామనామం చెప్పాలి.
No comments:
Post a Comment