Pages

Wednesday, 21 March 2012

ఉగాది పండుగ, విశిష్టత (నందన నామ సంవత్సరం):


బ్రహ్మ" గత ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చేది ఉగాదిని (యుగము  + ఆది) యుగానికి ఆదిగా, ప్రారంభ సమయంగా "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర ఆరంభం దినంగా పరిగణిస్తాం.

ఉగాది రోజు  చేయవలసిన కార్యాలు:

ఈ ఉగాది పర్వ శుభదినాన అందరూ ప్రాతఃకాలమున నిద్రలేచి అభ్యంగనస్నానమాచరించి నూతన వస్త్రములు ధరించి మంగళ ప్రదమైన మావిడాకులు రంగవల్లికలు ముంగిట అలంకరించుకుని వసంతలక్ష్మిని స్వాగతిస్తూ.. షడ్రచులతో (చేదుకి వేపపువ్వు , పులుపుకి చింతపండు, వగారుకి మామిడికాయ, ఉప్పుకి ఉప్పు,  కారంకి పచ్చిమిర్చి లేక  కారంపొడి,  తీపికి బెల్లం) సమ్మిళతమైన ఉగాది ప్రసాదాన్ని, పంచాగానికి, సంవత్సర దేవతకు నివేదనచే తమ తమ భావజీవితాలు మృదుమధురంగా సాగించాలని ఆకాంక్షిస్తూ, ఉగాది పచ్చడి స్వీకరింఛి,పంచాంగ శ్రవణం చేయాలి.



ఉగాది పచ్చడి విశిష్టత:

ఈ ఉగాది పచ్చడిని వైద్యపరంగా పరిశీలిస్తే ఇది వ్యాధినిరోధక శక్తిని ఇస్తుందని కూడా చెప్తారు. ఆ పచ్చడిలోని షడ్రరుచులలోని తీపి-చేదులో మానవ మనుగడలకు ప్రతీకలై నిలుస్తూ ఉంటాయని అంటుంటారు. 

ఇక తెలుగువారి సంప్రదాయాల్లో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ణాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్టులను ఆహ్నానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశమందు పంచాంగ శ్రవణము చేస్తారు. ఆ రోజు అందరూ ఆ నూతన సంవత్సరంలోని శుభశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావిజీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు.

ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల, తిథితో సంపదను, వారంతో ఆయుష్షు, నక్షత్రంతో పాపప్రక్షాళ, యోగం వలన వ్యాధి నివృత్తి కావడం, కరణంవల్ల గంగాస్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం. మరి ఈ ఉగాది సర్వులకు ఆయురారోగ్యాలు, సంపదలు, సుఖమయజీవనాన్ని అందించాలని ఆశిస్తూ.. ఉగాది పర్వదిన శుభాకాంక్షలు..!

పూజ  విధానం:

ఉగాది రోజున అభ్యంగన స్నానానికి అనంతరం పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి. మీకు నచ్చిన లేదా ఇష్టదేవతా పూజ చేసుకోవచ్చు. పూజకు ఉగాది పచ్చడి నైవేద్యం, పసుపు రంగులు పుష్పాలు వాడితే మంచిది. ఉగాది పండుగ రోజున ఉదయం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు పూజ చేయవచ్చు. దీపారాధనకు రెండు దూది వత్తులు, ఆవునెయ్యి వాడాలి. 
అలాగే ఉగాది నాడు ఇంతకుముందు చూడని పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం మంచిది. ఆలయాల్లో వసంతనవరాత్ర ఉత్సవములు నిర్వహించడం, లేదా మీ శక్తి చేయించగలిగే పూజ చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.

పండుగ:

                   ఉగాది పండుగ వచ్చింది
                   ఉగాది పండుగ వచ్చింది
                   ఊరికి అందం తెచ్చింది
                   ఉత్సవాలతో దేవుళ్ళకు
                   ఊరేగింపులు సాగాయి
                   గుడిలో దేవుని పూజించి
                   గురువుల పెద్దలను రావించె
                   పంచాంగాలను చదివించె
                   మంచీ చెడ్డలు విన్నాము
                   అక్కలు బావలు ఆసలతో
                   చక్కావచ్చారు పండుక్కి
                   అమ్మ వేకువ లేచింది
                   అందరికి తలలు కడిగింది
                   సరిపడే నగలు ఇచ్చింది
                   సరిక్రొత్త బట్టలు పెట్టింది
                   కులదేవతలను కొలిచింది
                   గొప్పగా పూజలు చేసింది
                   ఊటలు నోట్లో ఊరంగా
                   ఉగాది పచ్చడి పెట్టింది
                   ఉగాది పండుగ వచ్చింది
                   ఊరికి అందం తెచ్చింది 

No comments:

Post a Comment