Pages

Tuesday, 30 December 2014

RAVA LADDU

Ingredients:

Sujji Rava (Upma Rava)                    1 Cup
Grated  Coconut                               1 /2 to 1 Cup
Sugar                                               1 Cup
Dry Fruits                                         1/4 Cup
Gee                                                  2 tsps
Elachi Powder                                   1/8 Spn
Borneo Camphor (Pacha kartpooram) 1Pinch

Procedure:

  1. Take a nonstick pan and add gee to pan
  2. Add dry fruits to gee and make it fry until nice colour.
  3. Then take them out and add sujji rava to pan and make it fry to get good colour.
  4. Take rava into another bowl and add grated coconut powder to fry pan and make it fry  until nice colour.
  5. Add sugar to fried coconut and make it fry.
  6. sugar starts to melt and then add fried sujji rava to fry pan.
  7. Make it fry for 2mins and add pacha kartpooram and elachi powder  to pan and mix it well.
  8. Laddu mixer is ready to role.
  9. Now take some laddu mixer into ur hands and role as laddu and garnish wi th dry fruits.
  10. Now Rava laddu is ready to serve.
  11. we can store laddu upto 1 to 2 weeks.

Note:

If rava laddu  mixer is dry then add some hot milk to mixer and role as laddu.

Tip:

If u add milk when preparing laddu u store laddu in refrigerater.

Rava Laddu is here


Monday, 19 May 2014

దోస (Dosa) {Indian Breakfast}

దోస (Dosa)  {Indian Breakfast}

కావలసిన పదార్దాలు (Ingredients):

మినపప్పు  (Black Gram)       1Cup 
బియ్యం       (Rice)                    2 1/2 Cup 
ఉప్పు          (Salt)                     రుచికి తగినంత 
ఆయిల్        (Oil)                       5sps 
నీళ్ళు          (Water)                 1Glass 

తయారీ విధానం (Procedure):

1. మినపప్పు ,బియ్యంను 5-6 గంటల పాటు   నానపెట్టాలి. 
    Sock  Black Gram, Rice  in water upto 5-6 hours.
     
2. మినప్పప్పు,బియ్యంను  కడిగి నీళ్ళ ను మొత్తం  వంచెసుకొవలి. 
    Clean and  drain water from Black Gram and Rice.

3. గ్రైండర్  లో మినపప్పు, 1/4 గ్లాస్  నీళ్ళు  వేసి మేతగా రుబ్బుకోని  ఒక  గిన్నె లోకి తీసుకోవాలి .
    Grind the blackgram like smooth paste in  wet grinder or mixer by adding water.

4. తరువాత  బియ్యం 2/4 గ్లాస్  నీళ్ళు  వేసి మేతగా రుబ్బుకొని మినపప్పు తీసుకోన గిన్నె లోకే తీసుకోవాలి. 
    Grind the Rice like smooth paste in  wet grinder or mixer by adding water.

5. రుచికి తగినంత ఉప్పు వేసుకొని  పిండి మొత్తాన్ని కలుపుకోవాలి . 
    Add salt to paste and mix it well.

6. ఈ పిండిని ఒక రాత్రంతా పక్కన పెట్టి తెలవారుజామున ఒకసారి కలుపుకోవాలి . 
    keep in rest all over night and  mix it well flat bottm spoon.



7. దోస పెనం తీసుకోని పొయ్యి పెట్టి వేడిచేసుకోవాలి.ఒక గుడ్డ ను నూనెలొ ముంచి పెనం ఫై రుద్దాలి. 
    Take dosa penam and switch on stove. Rub the penam with oiled cloth.

8. దోస పిండి ఒక గరిటె తీసుకోని పెనం వేసి చదును ఉన్న ఒక గిన్నె లేదా గరిటె తో చదునుగా పెనంఫై                        పరుచుకొవలి. 
   Take one flat bottm spoon of paste onto penam and spread all over penam with help of flat           bottm spoon.




9. చెంచా  నూనె వేసి ఎర్రగా కాల్చుకోవాలి . ఇప్పుడు ఉల్టా చేసి 1ని ,, కాల్చుకోవాలి. 
     Roast dosa till it comes to golden brown colour. And turn to other side and keep on penam        on 1min.




10. ఇప్పుడు దోస ను మధ్యకు మడతపెట్టి ప్లేట్ లోకి తీసుకోవాలి . 
       Now fold the dosa into half and take it into serving plate.





11. ఈ దోస పప్పు చెట్నీ,కొబ్బరి  చెట్నీ,  కొబ్బరి కారం, సాంబార్ తో వేడిగా సర్వ్ చేసుకోవాలి. 
      Now serve the dosa with pappu chetney,coconut chetney, coconut spiced karam, sambar.



సూచెన (NOTE):

    దోస పిండి చిక్కగా ఉంటె  మీకు కావలసినన్ని నీళ్ళు  కలుపుకోవచు. 
    If dosa mixer is thick add water to the batter as you need.

కొబ్బరి కారం (Dry Coconut Spiced Powder)


కొబ్బరి కారం (Dry Coconut Spiced Powder)                    Quantity-250g 



కావలసిన పదార్ధాలు (Ingredients):


ఎండు కొబ్బరి                  (Dry Coconut)                  50g (1 full coconut)
పుట్నాలు                       (Fried  ChenaDal)           100g 
ఎండు మిరపకాయలు      (Dry Chillis)                      50g 
వెల్లుల్లి                            (Garlic)                              25g 
జీర                                 (Jeera)                               20g 
ఉప్పు                             (Salt)                                 రుచికి తగినంత 
నూనె                             (Oil)                                   2 sps 


తయారీ విధానం :
  • ఎండు మిరపకాయలను  నూనెలో వేయించు కోవాలి . 
  • పుట్నాలు ,ఉప్పు   నూనె లేకుండా 2ని ,, వేడి చేసుకోవాలి 
  • ఎండు కొబ్బరిని  పొడిగా  చేసుకోవాలి . 
  • తరువాత పుట్నాలు, ఎండు మిరపకాయలు, ఉప్పు  అన్నీ పొడిగా చేసుకోవాలి 
  • చివరిగా  వెల్లుల్లి,  జీరను పొడి చేసి అన్నీ పొడులను బాగా చేతితో  కలుపుకోవాలి. 
  • ఒక సరి రుచి చూసి ఒక డబ్బా తీసి జాగ్రత  చేసుకోండి . 

సూచన :
  • డబ్బా లోకి తిసుకునేతపుడు కారం పొడిగా ,  చల్లగా ఉండాలి. 
  • కొబ్బరి కారంను ఇడ్లి ,దోస ,వడ , పునుగు ,ఉప్మా  లతో వడ్డించు కోవాలి. 

Procedure:
  • Fry Dry Chillis in oil
  • Heat  Fried  Chene Dal, Salt with out oil.
  • Make Dry Coconut as powder with blender.
  • Add  Heated  Fried  Chene Dal, Dry Chillis, Salt make it as powder.
  • Finally add Jeera, Garlic and again grind it.
  • Mix it well with your hands and taste it.
  • Store in dry jar with carefully.

Note:
  • when storing the powder must dry and cool.
  • Serve Dry Coconut Spiced Powder with Indian breakfast like Idli, Dosa, Wada, Punugu, Upma. etc...




Tuesday, 25 February 2014

శివాష్టకం (Sivaashtakam)





ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజాం
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే |

గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలం
జటాజూట గంగోత్తరంగై ర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే |

ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ |
అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే |

వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్
గిరీశం గణేశం సురేశం మహేశం, మహేశం శివం శంకరం శంభు మీశానమీడే |

గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్
పరబ్రహ్మ బ్రహ్మాది భిర్వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే |

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదామ్భోజ నమ్రాయ కామం దదానమ్
బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే |

శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభు మీశానమీడే |

హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభు మీశానమీడే |

స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నం
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై స్సమారాధ్య మోక్షం ప్రయాతి |


Thursday, 20 February 2014

శ్రీ లింగాష్టకం (Sri Lingashtakam)



\
బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (1)

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (2)

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (3)

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత షోభిత లింగం
దక్ష సుయజ్న నినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (4)

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (5)

దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభి రేవచ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (6)

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (7)

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (8)

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే.

శ్రీ సాయి శివ స్తోత్రం (Sri Sai Shiva Stotram)





ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః (4)

సదాశివం భజామ్యహం సకల లోక నాయకం
సుజన చిత్త ప్రేరకం మనోభిలాష పూరకం
సురేశ్వరం గణేశ్వరం సనాతనాత్మ మానుషం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం |2|
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః |4| (1)

నమః పురారి సంతతం భయాక్రాంత నాశకం
సుధైర్య వీర్య దాయకం ప్రచండ తాండవ ప్రియం
త్రినేత్ర ధారి శంకరం త్రిశూల పాణి సుందరం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం |2|
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః |4| (2)

జటాధరం కృపాకరం సదా ఉమా సేవితం
విభూతి వేష భూషితం శశాంక కాంతి మండనం
చంద్రశేఖరం శివం నిరంతరం తమాశ్రయే
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం |2|
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః |4| (3)

నిర్గుణం నిరంతరం నిత్య సత్య మానసం
స్థిరాసనే సుఖాన్వితం సాధు సంరక్షకం
యతీశ్వరం మునీశ్వరం యజామ్యహం అహర్నిశం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం |2|
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః |4| (4)

రత్నాకర వంశితం భారద్వాజ గోత్రజం
సర్వ ధర్మ పోషకం సర్వ శక్తి రూపిణాం
సత్య సాయీశ్వరం మనసా స్మరామ్యహం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం |2|
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః |6| (5)

శ్రీ బిల్వస్తోత్రం (Sri Bilvastotram, Bilvashtakam)






త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (1)

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. (2)

కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం. (3)

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. (4)

ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. (5)

రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం. (6)

అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. (7)

ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. (8)

సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం. (9)

దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. (10)

బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (11)

సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం. (12)

అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం. (13)

బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం.

Wednesday, 22 August 2012

రామాయణం @ కధ -99


మరునాడు ఉదయం రాముడు బయలుదేరబోయే ముందు భారద్వాజుడు అన్నాడు " నీ ధర్మానుష్టానికి నాకు ప్రీతి కలిగింది రామ. నీ కొక వరం ఇస్తాను, ఏదన్నా కోరుకో " అన్నాడు.



అప్పుడు రాముడు " వానరములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫల సంవృద్ధి ఉండాలని నేను కోరాను. ఇప్పుడు ఇక్కడి నుంచి 3 యోజనముల దూరం వరకూ అయోధ్యకి ప్రయాణిస్తాము. ఆ మార్గంలో కూడా చెట్లన్నీ ఫల పుష్పభరితములై, తేనెపట్లతో తేనెలు కారుతూ ఉండాలి " అని అడిగాడు. 



తరువాత భారద్వాజుడి దెగ్గర సెలవు తీసుకొని పెద్ద కోలాహలంతో నందిగ్రామానికి రాముడు చేరుకున్నాడు. 



అప్పుడు భరతుడు తన సైనికులతో " రాముడు వచ్చేస్తున్నాడు, అయోధ్యలో ఉన్న తల్లులని తీసుకురండి, రథాలని తీసుకురండి, పెద్దవాళ్ళని తీసుకురండి, అందరినీ అయోధ్యకి రమ్మనండి. అంతటా పసుపు నీరు, గంధపు నీరు జల్లించండి. దివ్యమైన ధూపములు వెయ్యండి. అందరమూ కలిసి రాముడిని నందిగ్రామం నుంచి అయోధ్యకి పట్టాభిషేకానికి తీసుకువెళదాము " అని భరతుడు ఆజ్ఞాపించాడు.



రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్య వాసులు పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు. 



రాముడు పుష్పక విమానం నుంచి కిందకి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నగారి పాదాలకి పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణులు కన్నుల నీళ్ళు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగలించుకొని " ఇంతకముందు మేము నలుగురము, ఇవ్వాల్టి నుంచి మనం అయిదుగురము అన్నదమ్ములము సుగ్రీవ " అన్నాడు. తరువాత అక్కడున్న గంధమాదుడిని, మైందుడిని మొదలైనవారిని భరతుడికి పరిచయం చేశారు. అప్పుడు భరతుడు ఆ వానరాలని ' మీరు మా అన్నయ్యకి సహాయం చేశారు, మీరు ఎంత మంచివారు ' అని అందరినీ కౌగలించుకున్నాడు. 



పుష్పకం నుంచి కిందకి దిగిన వానరకాంతలు వాళ్ళ ప్రేమలని, వాళ్ళ అలంకారాలని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయ, సుమిత్రలు అన్నారు " ఈ వానర కాంతలందరికి మేమే తలస్నానాలు చేయిస్తాము " అని, వాళ్ళందరికీ తలస్నానం చేయించారు. 



తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని " కుబేరుడి దెగ్గరికి వెళ్ళిపో " అని ఆజ్ఞాపించాడు. అప్పుడా ఆ పుష్పకం కుబేరుడి దెగ్గరికి వెళ్ళిపోయింది.



అప్పుడు భరతుడు శిరస్సున అంజలి ఘటించి రాముడితో " మా అమ్మ అయిన కైకేయి ఆనాడు రెండు వరాలు అడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రిని సత్యము నందు నిలబెట్టడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నీ పాదుకలని న్యాసంగా ఇచ్చి నన్ను రాజ్యం చెయ్యమన్నావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో, అలా ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ పాదాల దెగ్గర పెట్టేస్తున్నాను. నీకు ఉన్నదానిని నాకు ఇచ్చి, నేను దానిని అనుభవిస్తుంటే చూసి నువ్వు మురిసిపోయావు, అందుకని ఇవ్వాళ నేను దానిని నీకు ఇచ్చేస్తున్నాను " అన్నాడు.



భరతుడి మాటలకి సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు. 



శత్రుఘ్నుడు అక్కడికి వచ్చి " అన్నయ్య! క్షుర కర్మ చేసేవారిని తీసుకొచ్చాను, నీ జుట్టు జటలు పట్టేసింది కదా అందుకని క్షుర కర్మ చేయించుకో " అన్నాడు. 



అప్పుడు రాముడు " నేను తండ్రి మాట నిలబెట్టడం కోసమని నా అంత నేనుగా అరణ్యవాసానికి వెళ్ళాను. కాని, తండ్రి ఆజ్ఞాపించక పోయినా, నాయందున్న ప్రేమ చేత స్వచ్ఛందంగా తనంత తాను దీక్ష స్వీకరించి, నా పాదుకలని తీసుకెళ్ళి సింహాసనంలో పెట్టి ,14 సంవత్సరములు రాజ్యమునందు మమకారము లేకుండా పరిపాలించిన భరతుడు ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప నేను దీక్షని విరమించను " అన్నాడు.



భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, విభీషణుడు క్షుర కర్మ చేయించుకుని మంగళస్నానం చేశాక రాముడు క్షుర కర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి, మంచి అంగరాగములను పూసుకొని, దివ్యాభరణములను ధరించి బయటకి వచ్చాడు.



తన కొడుకు ఇన్నాళ్ళకి తిరిగొచ్చాడని పొంగిపోయిన కౌసల్యా దేవి సీతమ్మకి అభ్యంగన స్నానం చేయించి, మంచి పట్టుపుట్టం కట్టి చక్కగా అలంకరించింది. కౌసల్య, సుమిత్ర, కైకేయల చేత అలంకరింపబడ్డ వానర కాంతలు 9000 ఏనుగుల్ని ఎక్కారు. దశరథుడు ఎక్కే శత్రుంజయం అనే ఏనుగుని తీసుకొచ్చి దానిమీద సుగ్రీవుడిని ఎక్కించారు. వానరులందరూ కూడా సంతోషంగా అయోధ్యకి బయలుదేరారు. సూర్యమండల సన్నిభమైన రథాన్ని రాముడు ఎక్కాడు, ఆ రథం యొక్క పగ్గములను భరతుడు పట్టుకొని నడిపించాడు. లక్ష్మణుడు నూరు తీగలు కలిగిన తెల్లటి గొడుగుని పట్టాడు. ఒక పక్క శత్రుఘ్నుడు మరొక పక్క విభీషణుడు వింద్యామర వేస్తున్నారు. అలా రథంలో అయోధ్యకి వెళుతున్న రాముడు కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు. 



ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగురవేశారు, అన్ని ఇళ్ళ ముందు రంగవల్లులు వేశారు, సంతోషపడిపోతూ, నాట్యం చేస్తూ అందరూ వెళుతున్నారు. ఆ వెళ్ళేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు నడిచాయి, ఆ వెనకాల వేద పండితులు నడిచారు, తరువాత పెద్దలు, వాళ్ళ వెనకాల కన్నె పిల్లలు, కొంతమంది స్త్రీలు పిండివంటలు పట్టుకుని నడిచారు. మార్గమధ్యంలో గంధపు నీరు జల్లుకుంటూ వెళ్ళారు. ఆ తరువాత సువాసినులు అయిన స్త్రీలు చేతులలో పువ్వులు, పసుపు, కుంకుమ పట్టుకుని వెళ్ళారు. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు. ఆ రాత్రికి అయోధ్యలో గడిపాక మరునాడు రాముడి పట్టాభిషేకానికి 4 సముద్ర జలాలు, 500 నదుల జలాలని వానరాలు తీసుకొచ్చాయి. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలని రాముడికి బహూకరించాడు. 





వానరాలు తీసుకోచ్చిన ఆ జాలలని రాముడి మీద పోసి ఆయనకి పట్టాభిషేకం చేశారు. కిరీటాన్ని తీసుకొచ్చి రాముడి శిరస్సున అలంకారం చేశారు. ఆ సమయంలో రాముడు కొన్ని కోట్ల బంగారు నాణాలు, లక్షల ఆవులు, వేల ఎద్దులు దానం చేశాడు. 



అప్పుడు రాముడు లక్ష్మణుడితో " లక్ష్మణా! యువరాజ పట్టాభిషేకం చేసుకో " అన్నాడు.



అప్పుడు లక్ష్మణుడు " అన్నయ్య! నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు. నాకు రాజ్యం వద్దు, భరతుడికి ఇవ్వు " అన్నాడు.



తరువాత యువరాజ పట్టాభిషేకం భరతుడికి జెరిగింది.




సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు మొదలైన వానర వీరులందరికీ బహుమతులు ఇచ్చారు. హనుమంతుడికి తెల్లటి వస్త్రముల ద్వయం, హారాలు ఇచ్చారు. 



ఆ సమయంలో, సీతమ్మ తన మెడలో ఉన్న ఒక హారాన్ని తీసి చేతిలో పట్టుకుంది. అప్పుడు రాముడు సీత వంక చూసి " ఈ హారాన్ని ఎవరికి ఇస్తావో తెలుసా. పౌరుషము, బుద్ధి, విక్రమము, తేజస్సు, వీర్యము, పట్టుదల, పాండిత్యము ఎవడిలో ఉన్నాయో, అటువంటివాడికి ఈ హారాన్ని కానుకగా ఇవ్వు, అన్నిటినీ మించి వాడు నీ అయిదోతనానికి కారణం అయ్యి ఉండాలి " అన్నాడు.



అప్పుడు సీతమ్మ ఆ హారాన్ని హనుమంతుడికి ఇచ్చింది. అప్పుడాయన ఆ హారాన్ని కన్నులకు అద్దుకొని మెడలో వేసుకున్నాడు. 



ఎప్పుడైతే ధర్మాత్ముడైన రాముడు సింహాసనం మీద కూర్చున్నాడో, అప్పుడు ఎవరినోట విన్నా' రాముడు, రాముడు ' తప్ప, వేరొక మాట వినపడలేదు. రాముడు రాజ్యం చేస్తుండగా దొంగల భయం లేదు, శత్రువుల భయం లేదు, నెలకి మూడు వానలు పడుతుండేవి, భూమి సస్యశ్యామలంగా పంటలని ఇచ్చింది, చెట్లన్నీ ఫలపుష్పములతో నిండిపోయి ఉండేవి, చాతుర్వర్ణ ప్రజలు తమ తమ ధర్మములయందు అనురక్తులై ఉన్నారు, చిన్నవాళ్ళు మరణిస్తే పెద్దవాళ్ళు ప్రేతకార్యం చెయ్యడం రామ రాజ్యంలో లేదు. ఆ రాముడి పరిపాలనలో అందరూ సంతోషంగా ఉండేవారు. 

                                      యుద్ధ కాండ  సమాప్తం 

Saturday, 18 August 2012

రామాయణం @ కధ -98



అప్పుడు దేవేంద్రుడు " రామ! ఒకసారి మేము వచ్చి దర్శనం ఇస్తే, ఆ దర్శనం వృధా కాకూడదు. అందుకని ఏదన్నా ఒక వరం కోరుకో " అన్నాడు.

రాముడన్నాడు " నాకోసమని తమ యొక్క కొడుకులని, భార్యలని విడిచిపెట్టి ఎన్నో కోట్ల వానరములు, భల్లూకములు, కొండముచ్చులు యుద్ధానికి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో కొన్ని మిగిలాయి, మిగిలిన వాటిలో కొన్నిటికి చేతులు తెగిపోయాయి, కొన్నిటికి కాళ్ళు తెగిపోయాయి, కొన్ని ఇంకా యుద్ధభూమిలో రక్తం ఓడుతూ పడున్నాయి, కొన్ని యమ సదనమునకు వెళ్ళిపోయాయి. మీరు నిజంగా నాయందు ప్రీతి చెందినవారైతే, యమ సదనమునకు వెళ్ళిన వానరములన్నీ బతకాలి, యుద్ధభూమిలో కాళ్ళు తెగిపోయి, చేతులు తెగిపోయి పడిపోయిన కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు మళ్ళి జవసత్వములతో పైకి లేవాలి. అవన్నీ యుద్ధానికి వచ్చేటప్పుడు ఎంత బలంతో ఉన్నాయో ఇప్పుడు మళ్ళి అంతే బలంతో ఉండాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ చెట్లకి ఫలాలు ఫలించాలి, పువ్వులు పుయ్యాలి, అక్కడ సమృద్ధిగా తేనె ఉండాలి, వాళ్ళు తాగడానికి ఎప్పుడూ మంచి నీరు ప్రవహిస్తూ ఉండాలి " అన్నాడు.

ఇంద్రుడు " తప్పకుండా నీకు ఈ వరాన్ని కటాక్షిస్తున్నాను " అన్నాడు.

వెంటనే యుద్ధ భూమిలో పడి ఉన్నవారు లేచి వచ్చారు, యమ సదనానికి వెళ్ళినవారు తిరిగి వచ్చేశారు. వానరులందరూ పరమ సంతోషాన్ని పొందారు. 

ఆరోజు రాత్రి అక్కడ విశ్రమించారు, మరునాడు ఉదయం రాముడు విభీషణుడిని పిలిచి " నేను తొందరగా అయోధ్య చేరుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి కాలి నడకన వెళితే చాలా సమయం పడుతుంది కనుక తొందరగా వెళ్ళడానికి ఏదన్నా ప్రయాణ సాధనం ఏర్పాటు అవుతుందా " అన్నాడు.


విభీషణుడు " మన దెగ్గర పుష్పక విమానం ఉంది, ఉత్తర క్షణంలో మీరు అయోధ్యకి చేరిపోతారు. ఇన్ని కష్టాలు పడ్డారు కదా, సీతమ్మ లభించింది కదా, సీతమ్మ అభ్యంగన స్నానం ఆచరించి, పట్టు పుట్టం కట్టుకుని, నగలు అలంకరించుకుంది కదా, మీరు కూడా తలస్నానం చేసి, పట్టు పుట్టాలు కట్టుకుని, ఆభరణములను దాల్చి, నా దెగ్గర బహుమతులు అందుకొని మీరు బయలుదేరితే నేను ప్రీతి పొందుతాను " అన్నాడు.

అప్పుడు రాముడు " నా తమ్ముడైన భరతుడు అక్కడ జటలు పెంచుకొని, మట్టి పట్టిన వస్త్రం కట్టుకొని, నా పాదుకలని సింహాసనం మీద పెట్టి, నన్ను చూడాలని శోకిస్తు రాజ్యం చేస్తున్నాడు. ఆ భరతుడు స్నానం చెయ్యక ముందు నేను స్నానం చెయ్యనా. భరతుడు పట్టు పుట్టం కట్టుకోక ముందు నేను కట్టుకోన. భరతుడు ఆభరణాలు పెట్టుకోక ముందు నేను పెట్టుకోన. నాకు తొందరగా భరతుడిని చూడాలని ఉంది " అన్నాడు.

విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు, రాముడు ఆ విమానాన్ని అధిరోహించాక " మీరందరూ నాకోసం చాలా కష్టపడ్డారు, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. నేను బయలుదేరతాను......." అని చెబుతుండగా, అక్కడున్న వాళ్ళందరూ అన్నారు " మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేము, మేము మీతో అయోధ్యకి వచ్చేస్తాము. మేము అక్కడ ఎక్కువ రోజులుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, మిమ్మల్ని కన్న కౌసల్యని ఒకసారి చూడాలని ఉంది, మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటె చూడాలని ఉంది రామ " అన్నారు.

విశాల హృదయుడైన రాముడు సరె అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ ఆ పుష్పక విమానంలోకి గబగబా ఎక్కేశారు. తరువాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది. అప్పుడు రాముడు సీతమ్మకి ఆ పుష్పక విమానం నుండి కిందకి చూపిస్తూ " సీత చూశావ, ఇదే నేను రావణుడిని పడగొట్టిన ప్రదేశం. అదిగో అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం, అది నరాంతకుడు పడిపోయిన ప్రదేశం, ఇది హనుమ విరూపాక్షుడిని పడగొట్టిన ప్రదేశం. ఆ సముద్రంలో ఉన్న సేతువుని మేము వానరములతో కలిసి నిర్మించాము. ఇక్కడే మేమందరమూ కూర్చుని ఈ సముద్రాన్ని ఎలా దాటడం అని అనుకున్నాము. ఇదే కిష్కింద, ఇక్కడి నుంచే వానరులు అన్ని దిక్కులకి నీ జాడ కనిపెట్టడానికి బయలుదేరారు " అని చెప్తుంటే సుగ్రీవుడు గబగబా వచ్చి " రామ! మనం కిష్కింద మీద నుంచే వెళుతున్నాము కదా, నా భార్యలు తార, రుమ చూస్తుంటారు, వాళ్ళని కూడా ఎక్కించుకుందాము " అన్నాడు.

అప్పుడా పుష్పకాన్ని కిందకి దింపారు. సుగ్రీవుడు వెంటనే వెళ్ళి తార, రుమ లకి విషయాన్ని చెప్పి రమ్మన్నాడు. అప్పుడు తార మిగిలిన ఆడవారి దెగ్గరికి వెళ్ళి " రండి, రండి, సుగ్రీవుడు జయాన్ని సాధించి రామ పట్టాభిషేకానికి వెళుతున్నారు. మంచి మంచి బట్టలు, ఆభరణాలు వేసుకుని అందరూ వచ్చెయ్యండి " అనింది. అప్పుడు వాళ్ళు మానవ కాంతలగా కామరూపాలని పొంది, పట్టుపుట్టాలు, ఆభరణములు వేసుకుని, పుష్పక విమానానికి ప్రదక్షిణం చేసేసి, లోపలికి ఎక్కి " సీతమ్మ ఎక్కడ? సీతమ్మ ఎక్కడ? " అని అడిగారు.   

" ఆవిడే సీతమ్మ " అని చూపిస్తే అందరూ వెళ్ళి ఆమెకి నమస్కరించారు. అప్పుడు సీతమ్మ వాళ్ళందరినీ సంతోషంగా కౌగలించుకొని, పలకరించింది. 

మళ్ళి రాముడన్నాడు " సీత! అదే ఋష్యమూక పర్వతం, అక్కడే నేను సుగ్రీవుడు కలుసుకున్నాము. అది శబరి యొక్క ఆశ్రమం. అక్కడున్న చిక్కటి వనంలోనే కబంధుడిని చంపాను. చూశావ సీత, అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం, ఇక్కడే రావణుడు నిన్ను అపహరించాడు " అని రాముడు చెబుతుంటే సీతమ్మ గబుక్కున రాముడి చెయ్యి పట్టుకుంది.

కొంతముందుకి వెళ్ళాక " అదే అగస్త్య మహర్షి ఆశ్రమం, ఇక్కడే అగస్త్యడు నాకు రావణ సంహారం కోసం అస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ కనపడుతున్నది సుతీక్షణుడి ఆశ్రమం. అక్కడ కనపడుతున్నది చిత్రకూట పర్వతం, ఇక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్ళము " అన్నాడు.

అలా ఆ పుష్పకం కొంత ముందుకి వెళ్ళాక వాళ్ళకి భారద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. అప్పుడు ఆ పుష్పకాన్ని అక్కడ దింపి, భారద్వాజుడికి నమస్కరించారు. అప్పుడు భారద్వాజుడు " రామ! నేను నా తపఃశక్తితో అన్ని కాలములయందు నీ గురించి తెలుసుకుంటున్నాను. నువ్వు రావణ సంహారం చెయ్యడం కూడా నాకు తెలుసు. ఇవ్వాళ ఒక్క రాత్రి నా దెగ్గర ఉండి, విశ్రాంతి తీసుకొని, నా ఆతిధ్యం తీసుకొని బయలుదేరు " అన్నాడు.


అప్పుడు రాముడు హనుమంతుడిని పిలిచి " హనుమ! నువ్వు ఇక్కడినుంచి బయలుదేరి వెళ్ళి, గంగానది ఒడ్డున శృంగిభేరపురంలో గుహుడు ఉంటాడు, అతను నాకు మిక్కిలి స్నేహితుడు. ఆ గుహుడికి నా క్షేమ సమాచారం చెప్పి, పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. తరువాత అక్కడి నుంచి బయలుదేరి అయోధ్యలో అందరూ కుశలంగా ఉన్నారా అని కనుక్కొని నందిగ్రామానికి వెళ్ళి, నేను తిరిగొస్తున్నాను అని భరతుడికి చెప్పి, ఆయన ముఖకవళికలు గమనించు. భరతుడి ముఖంలో ఏదన్నా కొంచెం బెంగ నీకు కనపడితే వెంటనే వెనక్కి వచ్చెయ్యి. ఇంక నేను అయోధ్యకి రాను, భరతుడు అయోధ్యని పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగ కనిపెట్టి తిరిగిరా " అన్నాడు.

వెంటనే హనుమంతుడు అక్కడినుంచి బయలుదేరి గుహుడిని కలుసుకొని, ఆయనని పలకరించి, రాముడు చెప్పిన విషయాన్ని చెప్పాడు. తరువాత అక్కడినుంచి బయలుదేరి వెళ్ళి భరతుడిని కలుసుకొని, రాముడు పడిన కష్టాలు, సీతాపహరణం, రావణ వధ మొదలైన విషయాలని వర్ణించి చెప్పాడు. హనుమంతుడి మాటలు విన్న భరతుడు చాలా సంతోషించాడు. 

Thursday, 16 August 2012

రామాయణం @ కధ -97


అప్పుడు సీతమ్మ " రామ! నన్ను చిన్నతనంలో పాణిగ్రహణం చేశావే, నా చెయ్యి పట్టుకున్నావే, చాలా కాలం కలిసి దాంపత్య జీవనం చేశామే, నేను ఎటువంటిదాననో నీకు తెలియదా, నేనంత చేతకాని స్త్రీలా నీకు కనపడుతున్నాన. నేను నిజంగా అటువంటి చారిత్రము ఉన్నదానిని అని నువ్వు అనుమానించిన వాడివైతే ఆనాడు హనుమని నాకోసం ఎందుకు పంపించావు. నేను రాక్షసుల మధ్యలో ఉన్నాను అని హనుమ నీకు చెబితే, మళ్ళి హనుమతోనే నేను నీ చారిత్రమును శంకిస్తున్నాను అని కబురు చేస్తే నేను ప్రాణాలు విడిచిపెట్టేదాన్ని. అలా చెయ్యకుండా నాకోసం ఎందుకు ప్రాణ సంకటాన్ని పొందావు, ఎందుకు సముద్రానికి సేతువు కట్టి, లంకకి వచ్చి, అంత యుద్ధం చేశావు. యుద్ధంలో జయాపజయములు విధి నిర్ణీతములు, నువ్వు గెలవచ్చు రావణుడు గెలవచ్చు. నాయందు నీకు ప్రేమ ఉంది కాబట్టి అంత ప్రాణ సంకటం తెచ్చుకున్నావు. కాని ఇవ్వాళ ఎందుకింత బేలగా మాట్లాడుతున్నావు. నేను స్త్రీని కాబట్టి ఎలా అయినా మాట్లాడచ్చు అనుకుంటున్నావా. నా భక్తి, నా సౌశీల్యం, నా నడువడి అన్నిటినీ వెనక్కి తోసేశావు. నేను బతికుంటే రాముడికి ఇల్లాలిగా బతుకుతాను, చచ్చిపోయినా రాముడికి ఇల్లాలిగానే చచ్చిపోతాను. ఒకసారి అపనింద పడ్డాక నాకీ జీవితంతో సంబంధం లేదు. లక్ష్మణా! చితి పేర్చు " అనింది.


అప్పుడు లక్ష్మణుడు రాముడి వంక కనుగుడ్లు మిటకరిస్తూ కోపంగా చూశాడు. రాముడు అంత కన్నా కోపంగా, ఎర్రటి కళ్ళతో లక్ష్మణుడి వంక చూసేసరికి లక్ష్మణుడు గబగబా వెళ్ళి చితిని పేర్చాడు. 

అప్పుడు సీతమ్మ " నా మనస్సు రాముడి యందే ఉన్నదైతే, సర్వ కాలముల యందు రాముడిని ధ్యానము చేసిన దాననైతే, పృధ్వీ, ఆకాశము, అష్ట దిక్పాలకులు, అంతరాత్మ, అగ్ని సాక్షిగా ఉండి, ఒక్క క్షణం కూడా నా మనస్సు రాముడిని విడిచిపెట్టనిది నిజమే అయితే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక " అని చెప్పి అగ్నిలో దూకింది.


అలా సీతమ్మ అగ్నిలో దూకగానే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, దేవతలు మొదలైనవారందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళకి నమస్కారం చేస్తున్న రాముడిని చూసి వాళ్ళు అన్నారు " అదేమిటయ్యా రామ అంత పని చేశావు. నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహా విష్ణువువి. నువ్వు లోకములను సృష్టించ గలిగిన వాడివి, లయం చెయ్యగలిగినవాడివి, పరబ్రహ్మానివి. సీతమ్మని అగ్నిలో ప్రవేశించమని ఎలా చెప్పగలిగావయ్య " అన్నారు.

అప్పుడు రాముడు " మీరందరూ నేను చాలా గొప్పవాడిని అని అంటున్నారు, నేను పరబ్రహ్మాన్ని అంటున్నారు, కాని నేను అలా అనుకోవడం లేదు. నేను దశరథ మహారాజు యొక్క కుమారుడిని, రాముడిని, నరుడిని అని అనుకుంటున్నాను. నేను యదార్ధముగా ఎవరినో మీరు చెప్పండి " అన్నాడు.

అప్పుడు బ్రహ్మ " సృష్టికి ముందు ఉన్నవాడివి నువ్వు, స్థితికారుడివి నువ్వు, లయకారుడివి నువ్వు, వరాహమూర్తివి నువ్వు, భూమిని ఉద్ధరించినవాడివి నువ్వు, ఆరోగ్యం నువ్వు, కోపం నువ్వు, రాత్రి నువ్వు, నీ రోమకూపాల్లో దేవతలు ఉంటారు, సమస్తము నీయందే ఉంది, అంత్యము నందు ఉండిపోయేవాడివి నువ్వు, నువ్వు కన్ను ముస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు " అని రాముడిని స్తోత్రం చేశారు.

తరువాత అగ్నిహోత్రంలో నుంచి అగ్నిదేవుడు తన తొడ మీద సీతమ్మని కూర్చోపెట్టుకుని బంగారు సింహాసనం మీద పైకి వచ్చాడు. అప్పుడాయన " రామ! ఈవిడ మహాపునీత. గొప్ప పుణ్యచారిత్రము ఉన్నది, ఈ తల్లి కంటితో కూడా దోషం చెయ్యలేదు. ఈవిడ పాతివ్రత్యం వల్లే రాక్షస సంహారం జెరిగింది. ఈ తల్లి మనస్సుతో కాని, వాక్కుతో కాని పాపం చెయ్యలేదు. నేను సమస్త జీవుల యొక్క కర్మలని చూస్తుంటాను, ఈ తల్లియందు కించిత్ దోషం లేదు. రామ! సర్వకాల సర్వావస్తల యందు నీ నామం చెప్పుకుని, నీ పాదముల యందు మనస్సు పెట్టుకున్న తల్లి ఈ సీతమ్మ. నువ్వు ఇంకొక మాట చెబితే నేను అంగీకరించను. ఈమెని నువ్వు స్వీకరించు " అన్నాడు.

అప్పుడు రాముడు " మీరందరూ చెప్పవలసిన అవసరం లేదు, సర్వకాలముల యందు ఈమె మనస్సు నా దెగ్గెర ఉందని నాకు తెలుసు. సముద్రం చెలియలి కట్టని దాటనట్టు, అగ్నిని చేత పట్ట లేనట్టు, సీతని రావణుడు తాకలేడన్న విషయం నాకు తెలుసు. కాని ఈ విషయం రేపు లోకమంతటికి తెలియాలి. చేత కానివాడు రాముడని లోకం అనకూడదు. సీత చారిత్రము ఏమిటో లోకానికి చెప్పాలని భర్తగా నేను అనుకున్నాను " అన్నాడు.

అప్పుడు రాముడు సీతమ్మ భుజం మీద చెయ్యివేసి ఆమెని దెగ్గరికి తీసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన వానరులందరూ ఆనందంతో పొంగిపోయారు.

దేవతలందరితో పాటుగా అక్కడికి వచ్చిన శివుడు అన్నాడు " నాయన రామ! నీ తమ్ముడైన భరతుడు అయోధ్యలో దీనంగా ఉన్నాడు, ఆయనని ఓదార్చు. నీ తల్లి అయిన కౌసల్యని ఊరడించు. కైకేయి, సుమిత్రలకి నమస్కరించు. లక్ష్మణుడిని ఊరడించు. ఇక్ష్వాకు వంశీయులు ఇంతకాలం నుంచి పరంపరాగతంగా పరిపాలిస్తున్న రాజ్యాన్ని నువ్వు పరిపాలించి, నీవారిని సంతోషపెట్టు. ఏ వంశంలో నువ్వు జన్మించావో ఆ వంశాన్ని పెంచు. యాగాలు చెయ్యి, బ్రాహ్మణులకు భూరి దానాలు చేసి పరమ సంతృప్తిని పొందు. తదనంతరం స్వర్గానికి చేరుకుందువు గాని. అదిగో, ఆ విమానంలో మీ తండ్రిగారైన దశరథ మహారాజు ఉన్నారు, వెళ్ళి చూడు " అన్నాడు.

తండ్రిని చూడగానే లక్ష్మణుడితో కలిసి రాముడు నమస్కారం చేశాడు. అప్పుడు దశరథుడు రాముడిని ఒకసారి ఆనందంతో గట్టిగా కౌగలించుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకుని " రామ! నేను స్వర్గలోకంలో విహరించానురా, ఇంద్ర లోకంలో తిరిగానురా, కాని నువ్వు లేకపోతె అది కూడా నాకు పెద్ద సుఖంగా అనిపించలేదురా. ఆనాడు నీకు పట్టాభిషేకాన్ని చేద్దాము అనుకోవడం, నేను ఎంతో ఆనందాన్ని పొందడం, రాత్రి కైక దెగ్గరికి వెళ్ళడం, కైక వరాలు కోరడం, నీ పట్టాభిషేకం భగ్నం అవ్వడం, ఆనాడు నేను ఏడ్చి ఏడ్చి నా శరీరాన్ని వదిలిపెట్టడం నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. నేను ఇప్పుడు తెలుసుకున్నదేంటంటే, ఆ పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కారణం దేవతలు. రావణ సంహారం జెరగాలి కనుక దేవతలు ఆనాడు నీ పట్టాభిషేకాన్ని భగ్నం చేశారు " అన్నాడు.

అప్పుడు రాముడు " ఆనాడు మీరు భావనా వ్యగ్రతని పొంది, నా పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కైకమ్మ కారణం అనుకొని ' ఇప్పుడే నేను నిన్ను విడిచి పెట్టేస్తున్నాను, నువ్వు నా భార్యవి కావు, నీ కుమారుడు భరతుడు నాకు కొడుకు కాదు ' అన్నారు. ఆ మాటని మీరు ఉపసంహారం చెయ్యండి, నేను సంతోషిస్తాను " అన్నాడు.

అప్పుడు దశరథుడు " నువ్వు కోరుకున్నటు తప్పకుండా జెరుగుతుంది " అన్నాడు. తరువాత ఆయన లక్ష్మణుడితో " నాయన లక్ష్మణా! నువ్వురా ప్రాజ్ఞుడవి అంటె. చక్కగా అన్నయ్య సేవ చేశావు, ఇలాగె సర్వకాలముల యందు అన్నయ్యని, వదినని సేవిస్తూ నీ జన్మ చరితార్ధం చేసుకో " అన్నాడు.

అప్పుడు దశరథుడు రామలక్ష్మణుల వెనకాల తనకి నమస్కారం చేస్తూ నిలబడ్డ సీతమ్మని దెగ్గరికి పిలిచి " అమ్మా సీతమ్మ! నీ మనస్సుకి కష్టం కలిగిందా. ' సీత! నీతో నాకు ప్రయోజనం లేదు, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు ' అని మావాడు అన్నాడు కదా, అలా అన్నాడని నువ్వు బాధపడ్డావ. ఇవ్వాళ నేను ఊర్ధలోకవాసినమ్మా, తప్పు మాట చెబితే కిందకి పడిపోతాను, నీకొక నిజం చెప్పనా, రాముడికి నీమీద ఎప్పుడూ అటువంటి అభిప్రాయం లేదు. ఆ మాట ఎందుకన్నాడో తెలుసా, నిన్ను వేరొకరు ఎప్పుడూ వేలెత్తి చూపించకూడదని మావాడి తాపత్రయం. 

కూతురా! నువ్వు ఇవ్వాళ చేసిన పతి సేవ వల్ల జెరిగిన గొప్పతనం ఏమిటో తెలుసా, ఇతఃపూర్వం పతివ్రతలై భర్తని సేవించిన వాళ్ళందరి చరిత్రలను పక్కన పెట్టి, పతివ్రత అంటె సీతమ్మ అని నిన్ను చూపిస్తున్నారు. నీలాంటి కోడలు నా వంశానికి రావడం నా అదృష్టం. నీకు నేను ఇంక చెప్పడానికి ఏమిలేదమ్మ, నీకు అన్నీ తెలుసు, కాని మామగారిగా ఒక్క మాట చెబుతాను. అమ్మా! భర్త మాత్రమే దైవము అని తెలుసుకో " అన్నాడు.

తరువాత దశరథుడు విమానంలో ఊర్ధలోకాలకి వెళ్ళిపోయాడు.